సొంతిల్లు పేదలకు గౌరవం ఇస్తుంది
- రాజాపూర్ లోని 10 గ్రామాల 30 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.
రాజాపూర్,సెప్టెంబర్ 22: ప్రతి కుటుంబానికి సొంతిల్లు సమాజంలో గొప్ప గౌరవం ఇస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. మంగళవారం మండలంలోని 10 గ్రామాలకు చెందిన 30 మంది ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య, శ్రీనివాస్ నాయక్,రమేష్, విక్రం రెడ్డి, భరత్ రెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు.