ఒకరోజు ఆధ్యాత్మికయాత్ర

19-09-2026 | 05:05am

ఆచార్య మనన చెన్నప్ప :

నల్గొండ టౌన్ హాల్‌(Nalgonda Town Hall)లో జరిగిన కార్యక్రమంలో నేను ప్రసంగించాను. ఇది జరిగి నాల్గుదేండ్లు అవుతుంది. నా ప్రసంగం విన్నవారిలో ‘కలామ్ పౌండేషన్(Kalam Foundation)’ అధ్యక్షులు ఇమ్మడి బుచ్చన్న(Immadi Buchanna) ఉన్నా డు. ఒకటి రెండు రచనలను(Writings) వారికిచ్చి చదవమన్నాను. వాటిని చదివిన తర్వాత చక్క గా స్పందించాడు. అంతరంగం మురిసేవిధంగా మాట్లాడాడు. చాలావరకు నేను పుస్తకాలిస్తే అంతగా ప్రతిస్పందించిన వాళ్లు లేరు. బుచ్చన్నమాత్రం ‘మీరు రాసి న పుస్తకాలు(Books) నాకు కావాలి’ అని ఇంటికి వచ్చి నేను ఉపనిషత్తుల మీద రాసిన పుస్తకాలు వ్యాస సంపుటాలు తీసుకొని వెళ్లా రు.

ఆ తర్వాత వారే కార్యక్రమం చేసినా నన్ను ఆహ్వానించి నాచేత మాట్లాడించడం మొదలుపెట్టారు. ‘వందేమాతరం’ ఫౌండేషన్(Vandemataram Foundation) ఆధ్వర్యంలో యాచారంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేశారు. మ హేశ్వరంలో జరిగిన విద్యార్థుల ప్రతిభాపురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ముద్రణాయంత్రం నడిపే బుచ్చన్న ప్రజాసేవలో తనదైన ముద్రవేశారు. తన కుటుంబాన్ని ఎంత బాగా చూ సుకుంటారో, స్నేహితులను అంతేబాగా చూసుకుంటారు.

ఎప్పుడూ స్నేహితులతో తన సహాధ్యాయులతో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటారు. నన్నొకసారి అడిగారు. “మీరు జోగులాంబాను దర్శించారా? అని” ఔను ఆ అమ్మవారి శక్తి పీఠం చూడలేదు అన్నాను” ఒకసారి మనం ఆధ్యాత్మికయాత్ర నిర్వహిద్దామా? అని అడిగారు. నేనూ సరే అన్నాను. ఐతే ఆ యాత్ర ఒక ఆరు నెలల నుంచి వాయిదాపడింది. ఎట్టకేలకు అమ్మవారి అనుగ్ర హంతో యాత్ర చేయడానికి వీలైన రోజు రానే వచ్చింది. 

26-8-2026 నాడు బుచ్చన్న ఇన్నో వా కార్లో మా ఇంటికి వచ్చాడు పొద్దున ఆరుగంటలకే కార్లో వారితోపాటు వారి క్లాస్‌మేట్స్ సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ శర్మ, శంకర్, చిరంజీవి ఉన్నారు. నేనప్పటికే తయారయ్యాను కనుక వారి కారులో ముందుసీటులో కూర్చొని ప్రయాణించాను. 

కారులో కూర్చున్న తర్వాత తెలిసింది బుచ్చన్నకు వారు నల్గురు ప్రాణమిత్రులని. ‘నల్గురితో నారాయణ’ అన్నట్లు బు చ్చన్న ఎక్కువగా ఈ నల్గురితో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. మా కారును నడిపిస్తున్న వారు వారికిష్టపాత్రులైన విష్ణువర్ధన్ శర్మ. మా కారు నేనున్న బోడుప్పల్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా ప్రయాణం సాగించింది. సరదాగా వెళ్లి రావడమే అనుకున్నాను నేను. కాని మా చిన్న ఒకరోజు యాత్రకు బుచ్చ న్న ‘కలాం ఫౌండేషన్ స్పిర్చివల్ జర్నీ’ అని పేరు పెట్టాడు.

ఉదయం 6 గంటలకు బయల్దేరిన మేం మధ్యన స్వల్పాహారం తీసుకొని మధ్యాహ్నం పన్నెండులోగా ఆలంపూర్ చేరుకొని జోగులాంబగుడిలో ప్రవేశించాం. అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ శక్తిపీఠం ఐదవది. అటు ఆంధ్రా నుంచి ఇటు తెలంగాణ నుంచి మాత్రమేకాక ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తా రు. అరగంటలో అమ్మవారిని దర్శించి మొక్కుకున్నాం. అక్కడ మాకు కుంకుమ పొట్లంతో పాటు ఒక నిమ్మకాయను అమ్మవారి ప్రసాదంగా ఇచ్చారు.

గుడికి ఎదురుగా ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అది తుంగభద్రానది, కృష్ణానది కలిసిన మధురజల సంగమం! సాధారణంగా పుణ్యక్షేత్రాలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. పరమయోగులిక్కడికి వచ్చి అమ్మవారిని దర్శిం చుకునేవారు కనుక అమ్మవారు ‘జోగులాంబ’గా పేరుగాంచింది. సంస్కృతంలో ‘యోగి’ శబ్దం తెలుగులో ‘జోగి’ అయ్యింది. 

‘జోగులాంబ’ ఉగ్రరూపంలో ఉందనుకున్నామేగాని, నాకు మాత్రం ఆమె భక్తుల కు ప్రసన్నవదనంతో దర్శనమిస్తున్నట్లు అగుపించింది. ఈ ఆలయ ప్రాంగణంలో బాదామి చాళుక్యులనాటి చారిత్రక ప్రసిద్ధిపొందిన తొమ్మిది నవబ్రహ్మ శివాలయా లు కనిపిస్తాయి. ‘బాలబ్రహ్మేశ్వరస్వామి’ ఆలయం వీటిలో ప్రధానమైంది. 

ఇట్టి పవిత్రమైన ధార్మిక క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ చేరుకున్నాం. బుచ్చన్నగారు తన మిత్రుడైన సుబ్బారావుగారి ఇంటికి మ మ్మల్ని తీసుకొని వెళ్లాడు. మమ్మల్ని సుబ్బారావుగారు సాదరంగా ఆహ్వానించారు. బుచ్చన్న గారితో మీకుగల అనుబం ధం ఏమిటని అడిగాను వారిని. “బుచ్చన్నగారు ప్రేమశీలి. ఇతరుల సుఖాల్లోనే కాదు, కష్టాల్లో పాలు పంచుకునేవ్యక్తి.

నేను ఆంధ్రావాసిని ఐనప్పటికీ నన్ను పిల్లల బ్యాగులు తయారు చేసే పనిలో పెట్టి, నన్ను ధనవంతుడిని చేశాడు. నేను బుచ్చన్నగారి ఇంటిలో ఎన్నో నెలలుండి నా పని ని నిర్వహించినాను. ఇప్పుడు కర్నూల్‌లో స్థిరపడి ఒక చక్కని ఫ్లాట్‌లో ఉంటున్నా ను” అని వారు చెప్పిన మాటలు బుచ్చన్న మంచి మనస్సును తెలుసుకునే అవకాశం ఇవ్వడమే గాక, ఆయన యెడల నాకు మిక్కిలి మైత్రి కలగడానికి కారణమైంది. 

సుబ్బారావు గారిచ్చిన ఆతిథ్యాన్ని మేం ఆరుగురం తీసుకొని సాయంత్రం 5 గంటలకు మంత్రాలయం వెళ్లాం. తుంగభద్రా నదీ తీరంలో వెలసిన ‘రాఘవేంద్ర స్వామి బృందావనం’ దర్శించాం. మధ్వాచార్యులు ద్వైత సంప్రదాయానికి ప్రవక్త. ‘జీవాత్మవేరు, పరమాత్మవేరు’ అని వారు వేద సిద్ధాంతాన్ని తెలియజేశారు. అట్టి మధ్వాచార్యుల పరంపరలోనివాడు రాఘవేంద్ర స్వామి, ఆయన 17వ శతాబ్దిలో సజీవంగా బృందావన ప్రవేశం చేశారని ప్రతీతి. మంత్రాలయానికి ‘మాంచాలె’ అన్నది పూర్వనామం.

ఈ ఆలయ ప్రాంగణంలో ‘మాంచాలాదేవి ఆలయం’ ఉండడం విశేషం. విశాలమైన భవన సముదాయం లో మంత్రాలయం భక్తులను ఆకర్షిస్తుంది. మాకు స్వామి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్వామి ప్రసాదాన్ని తీసుకొని (అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలు) హైదరాబాదుకు బయలుదేరాం. కేవలం మేం రెండు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి బయల్దేరాంగాని కారులో మా సంభాషణ పూర్తిగా వేదాలమీద, ఉపనిషత్తుల మీద, భారత భాగవ తాల మీద కొనసాగింది.

మా సంభాషణలో శ్రీరాముని గొప్పతనం, శ్రీకృష్ణుని మహిమలు చోటు చేసుకున్నాయి. పతంజలి తన ‘యోగదర్శనం’లో క్రియాయోగా న్ని గూర్చి ‘తపఃస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ఇతిక్రియాయోగః’ అంటాడు. మ నం కష్టసుఖాలను సమానంగా చూస్తూ, సద్గ్రంధ పఠనం సాగిస్తూ, పరమేశ్వరుడిపట్ల పూర్ణభక్తి (విశ్వాసం) కల్గి ఉండాలని అందుకు నేను రచించిన గ్రంథాల్లోని అనేకాంశాలను ముచ్చటించాను.

1980లో రచించిన ‘మల్లిపదాలు’లోని పదాలను వినిపిస్తూ, కారులోని మిత్రులను అలరిస్తూ నా సంభాషణను కొనసాగించాను. శంకర్ గారు బడిలో పాఠాలు చెబుతారు కాని సభల్లో పాటలు పాడుతారు. గురుభక్తికి దైవభక్తికి సంబంధించిన పాటలెన్నో వారి గొంతు నుంచి దొర్లినాయి. 

అట్లే సురేందర్ రెడ్డి గారు లెక్కల లెక్చరర్‌గా పనిచేసినా, భారత, భాగవత, రా మాయణాల మీద అనర్గళంగా మాట్లాడగల్గిన ధీశాలి. మా కారు నడిచినంతసేపు మా సంభాషణ కొనసాగింది. శ్రీరామునిలోకోపకారకమైన పనులను, శ్రీకృష్ణుని మహిమోపేతమైన కృత్యాలను సురేందర్ రెడ్డిగారు చెబుతుంటే ఎవరైనా చెవులు కోసుకోవాలనిపిస్తుంది. ఇకశర్మగారు వా హన చోదకులుగా ఉన్నప్పటికీ, వారు మాట్లాడటానికి మాకవకాశం ఇచ్చినట్లనిపించింది. చిరంజీవి పేరును బట్టే మీకు తోడయ్యాడు. 

నిజంగా బుచ్చన్నగారు మాచే చేయించిన యాత్ర ‘ఆధ్యాత్మికయాత్ర’. ఒకరోజు చేసినప్పటికీ చాలాకాలం గుర్తుండిపోయే యాత్ర. 

“చెరిపినా మాయనిది

చిరకాలముండునది

సృష్టిలో తీయనిది

స్నేహమే మల్లీ”

అనే నామల్లిపదానికి చక్కని నిదర్శనం మా మిత్రులతో కూడి చేసిన జోగులాంబ, మంత్రాలయ యాత్ర. 

 వ్యాసకర్త సెల్: 9885654381

మరిన్ని వార్తలు