21 August, 2026 | 12:44 AM

శాస్త్రీయ కులగణన చేపట్టాలి

21-08-2026 12:29 AM
  1. ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన 
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో తెలంగాణ కులగణనను మోడల్‌దీతిజిజిగా తీసుకుని బీసీలను కులాల వారీగా శాస్త్రీయ ంగా లెక్కించాలని బీసీ జేఏసీ చైర్మన్ జా జుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. సోషల్ కేటగిరీ, కులం, సబ్‌కాస్ట్‌ను నమోదు చేసి ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని కోరారు.

ఈ నెల 14న కేంద్రం విడుదల చేసిన జనగణన గెజిట్‌లో బీసీ కులాల అధికారిక జాబి తా, కోడ్‌లు లేకపోవడం అభ్యంతరకరమన్నారు. దీనివల్ల గోత్రం, ఇంటిపేరు తదితరా లను కులంగా నమోదు చేసే అవకాశం ఉందని, జనాభా లెక్కల్లో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణ, బీహార్ కులగణన విధానాలను దేశవ్యాప్తంగా అమ లు చేయాలని కోరారు. బీసీల జనాభా దా మాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉ ద్యోగ రంగాల్లో హక్కులు, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని కోరారు. ఆగస్టు 24 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు, సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో బీసీ రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తామని తెలిపారు. నవం బర్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లక్ష మంది బీసీలతో ఉద్యమం చేపడతామ ని, కులాల వారీగా లెక్కలు తేలే వరకు పో రాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్   కుందారపు గణేశాచారి అధ్యక్షత వ హించగా బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, నాయకులు కనకాల శ్యామ్, కురుమ పిట్ల శ్రీధర్, రావులకొల్లు నరేష్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, జాజు ల లింగం, తారకేశ్వరి పాల్గొన్నారు.