ఎల్బీనగర్ నియోజకవర్గంలో తీజ్ ఉత్సవాలకు ప్రత్యేక స్థలం
- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
- సాహెబ్ నగర్‌లో కన్నుల పండువగా తీజ్ ఉత్సవాలు
ఎల్బీనగర్, సెప్టెంబర్ 6 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బంజారాలు తమ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ (TPCC Campaign Committee Chairman Madhu Yashki Gowda) అన్నారు. సేవాలాల్ మహారా జ్ బంజారా సేవాదళ్ ఆధ్వర్యంలో సాహె బ్ నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఆదివా రం నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... కులాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఐక్యంగా ఎదుర్కోవాలని సూచించా రు.
ఎల్బీనగర్ నియోజకవర్గం లో బంజారా సోదరులు పండుగలు, తీజ్ ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనువైన స్థలాన్ని కేటా యించి, భవనం నిర్మించేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానన్నారు. బంజారా సోదరులు ఐక్యమత్యంతో పోరాడినప్పుడే హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ సుజాత నాయక్ పై గతంలో స్థానిక ఎమ్మెల్యే వేధించిన సమయంలో, మొన్న సాహెబ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్ నాయక్ పై, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణపై కొందరు వ్యక్తులు అనుచిత, అసభ్య మాటలు గిరిజన బంజారా సోదరులు సరైన రీతిలో స్పందించకపోవడం విచారకరమన్నారు. కులాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే ఎవరూ సహించకూడదని, ఐక్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
బంజారా, గిరిజన సోదరులు ఐక్యంగా ఉన్నప్పుడే రా జకీయంగా కానీ, ఇతర రంగాల్లోనూ అవకాశాలు వస్తాయని సూచించారు. కార్యక్రమం లో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు శ్రీనా థ్, డీసీసీ ఉపాధ్యక్షులు కొండోజు శ్రీనివాస్, స్పోక్స్ పర్సన్ దాము మహేందర్ యాదవ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ నాయక్, జిల్లా కార్యదర్శి రేణు గౌడ్, ఎస్సీ సెల్ సాహెబ్ నగర్ అధ్యక్షురాలు సరస్వతి, నాయకులు సురేష్ యాదవ్, నందకిశోర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.






