వంట సామగ్రి చోరీ కేసులో నిందితుడికి రిమాండ్

16-09-2026 | 11:25pm

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఇంటి తాళం పగులగొట్టి వంట సామగ్రిని చోరీ చేసిన ఓ యువకుడిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట పట్టణం(Siddipet town)లోని చార్వదన్ ప్రాంతానికి చెందిన షేక్ మొహసిన్ (25) అనే యువకుడు జూలై 19న రాత్రి తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి వంట సామగ్రిని ఎత్తుకెళ్లాడు. ఈ విషయమై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టు ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు