6 September, 2026 | 10:12 PM

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

06-09-2026 | 08:53pm

రాజాపూర్, సెప్టెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌(B.R. Ambedkar)ను విమర్శిస్తున్న హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని మండల అంబేద్కర్ సంఘం సభ్యులు, అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మధ్యకాలంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌(B.R. Ambedkar)పై కల్పిత నాయకుడని ప్రచారం చేస్తూ, ఆయనను కించపరుస్తూ సెప్టెంబర్ 8వ తేదీన పుస్తకం ఆవిష్కరిస్తానని ప్రకటించాడు.

రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలను అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాతపైనే విమర్శలు చేస్తున్న రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షుడు హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని, అదేవిధంగా అతను ఆవిష్కరించబోతున్న ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ అనే పుస్తక ఆవిష్కరణను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంబేద్కర్ సంఘ మండల కమిటీ కోరారు.

ప్రపంచ దేశాలు మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తెలివితేటలను చూసి, మన దేశంలో పాటిస్తున్న పద్ధతులను, రాజ్యాంగ రచనలను, మన దేశ పరిపాలన విధానాలను అనుసరించేందుకు విదేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. స్వదేశస్తులు మాత్రం ఆయనపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాజాపూర్ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కృష్ణయ్య, డీసీసీ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ నర్సింలు, బచ్చిరెడ్డి కృష్ణయ్య, వెంకటేష్, కార్యవర్గం, వివిధ పార్టీలకు చెందిన అధ్యక్షులు, వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు