ఏడీఏగా ప్రవీణ్ చారికి అదనపు బాధ్యతలు
26-09-2026 | 01:45pm
శుభాకాంక్షలు తెలిపిన ఏఈఓలు, అధికారులు
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ చారి నారాయణఖేడ్(Praveen Chari Narayankhed) సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA)గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. నారాయణఖేడ్‌లో ఏడీఏగా పనిచేసిన నూతన కుమార్ రెండు నెలల క్రితం బదిలీపై నల్గొండకు వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ చారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ శాఖ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల ఏఈఓలు మైపాల్, సంతోష్, చరణ్‌తోపాటు మండల అధికారులు, పలువురు రైతులు ప్రవీణ్ చారికి శుభాకాంక్షలు తెలిపారు.