బ్రిడ్జి నిర్మించిన ఫలితం లేకుండా పోయింది
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారముల గ్రామమైన పెద్దగూడ గిరిజన కష్టాలు తీర్చేందుకు అదిలాబాద్ తన నిధుల నుండి 15 లక్షల కేటాయించారు. అయితే ఆ నిధులతో బ్రిడ్జి నిర్మాణం జరిగిన గ్రామస్తులు ఆశించిన ఫలితం లేకుండా పోయింది. వరద ఉధృతి అధికంగా ఉండడం వల్ల నిర్మించిన తర్వాత కురిసిన వర్షానికి విడిచి పక్కన రోడ్డు కోతకు గురైంది. దీంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పక్కన కోతకు గురైన స్థలంలో మట్టిని నింపారు. అయినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.
అదనపు నిధులు అవసరం...
బ్రిడ్జికి ఇరువైపులా కోతకు గురికాకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేసి సీసీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు. మరో 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తే గ్రామస్తులకు రోడ్డు ఇబ్బందులు తీరిపోతాయి. ఎంపీ జి నగేష్ మరో మారు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.