పీహెచ్‌డీ విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్
విదేశాల్లో పీహెచ్‌డీ (PhD) చేయాలనుకునే విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం అదిరిపోయే ఆఫర్ (Offer) ప్రకటించింది. ప్రతిభావంతులైన పరిశోధకులను ఆకర్షించేందుకు ఏకంగా 100 మిలియన్ కెనడియన్ డాలర్లతో (Funding) కొత్త స్కాలర్‌షిప్ (Scholarship) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్‌షిప్స్’ (President’s Impact Scholarships) పేరుతో చేపట్టిన ఈ పథకంలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి 80 వేల కెనడియన్ డాలర్లు అందించనున్నారు. నాలుగేళ్లలో మొత్తం 3.2 లక్షల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.08 కోట్లు లభించనున్నాయి.ఎంపికైన విద్యార్థులు ఇద్దరు అధ్యాపకుల పర్యవేక్షణలో రీసెర్చ్ (Research) చేయనున్నారు. విభిన్న రంగాలను అనుసంధానిస్తూ సంక్లిష్ట ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు (Solutions) కనుగొనే పరిశోధనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వర్సిటీ తెలిపింది.
ఈ కార్యక్రమానికి ఓ కెనడియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (Family Foundation) 50 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వగా.. విశ్వవిద్యాలయం మరో 50 మిలియన్ డాలర్లు జోడించింది. 2027 సెప్టెంబర్ నుంచి ఏటా 12-13 మంది విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్‌షిప్ అందనుంది. నాలుగో ఏడాదికి మొత్తం 50 మంది స్కాలర్లకు (Scholars) ప్రయోజనం చేకూరనుంది. 2027 క్యూఎస్ (QS) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో టొరంటో యూనివర్సిటీ 32వ స్థానంలో నిలిచింది.