ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలి
రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ డిమాండ్
జనగామ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party)డీసీసీ కార్యాలయంలో (DCC Office)డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ (State Official Spokesperson Nooka Kiran Yadav) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం జరిగిందో అందరికీ తెలుసు.
అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ కు వేల ఎకరాల భూములు, ఫామ్ హౌస్ లు ఎక్కడి నుంచి వచ్చాయి? కొడుకు కేటీఆర్ కు, అల్లుడు హరీష్ రావుకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22-ఏ వంటి చట్టాలను అడ్డుపెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ ఆస్తులపై విచారణ జరిపి ప్రజల సొమ్మును ప్రజలకే అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబెర్ లకావత్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీసీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.