ఉష మృతికి ఎమ్మెల్యే మట్టా రాగమయి నివాళి

05-10-2026 | 04:15pm

అనారోగ్యంతో అంగన్వాడి టీచర్ ఉష మృతి

సత్తుపల్లి,(విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ ఎస్.కే ఖాదర్ బాబా(Senior Journalist S.K. Khader Baba) వారి సతీమణి ఉష అంగన్వాడి టీచర్(Anganwadi Teacher) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాదులో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆదివారం రాత్రి అనారోగ్య కారణంగా ఆమె మృతి చెందడంతో, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayee Dayanand) వారి స్వగృహము రాజీవ్ కాలనీకి వెళ్లి, ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఆమె అనారోగ్యంగా ఉండగానే శాసన సభ్యురాలు హాస్పిటల్ కి వెళ్లి ఆమెను పరామర్శించి, అండగా నేనుంటాను అని ధైర్యం ఇచ్చినా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుమారుడు రాహుల్, భర్తకు ఖాదర్ కు ధైర్యాన్ని అందించి, ఓదార్పునిచ్చారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా కమల్, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, మీడియా సభ్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు