ఎత్తర ఎత్తు ఎర్రజెండా ఎత్తు
శ్రీవిష్ణు హీరోగా(Sri Vishnu Hero) పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan)’. ఈ చిత్రానికి జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పకుడు కాగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Tollywood director Anil Ravipudi) ‘ఎత్తర ఎత్తు’ అనే సాంగ్‌ను లాంచ్ చేశారు.
‘అడవి బిడ్డ నోటికాడ అంబలి లాగేస్తడా.. బాంచత్ వాడెవ్వడంట లాయిలప్పా లాయిలో.. పదరా పద తేల్చుకుందాం లాయిలప్పా లాయిలో.. ఊరుకుంటే గుండెమీద కాత్తోటి తంతడా కాళ్లే ఇరిచేసి వద్దాం లాయిలప్పా లాయిలో.. ఏట్లో కలిపేసి పోదాం లాయిలప్పా లాయిలో..’ అనే సాకి, విప్లవానికి సన్నద్ధమయ్యే సందర్భంలో వచ్చే పాట అని తెలియజేస్తోంది.
‘అరే దొరగారి చెప్పుకింద ఎన్నాళ్లీ నలుగుడంట.. మోచేతి నీళ్లతోటి ఏ దప్పిక తీరదంట.. బుసకొట్టిన పాముమీద చీమలు దండెత్తెనంట.. రాజుకుంటె అగ్గిరవ్వ అడివంతా బూడిదంట.. మనదేమో మురికివాడ.. ఆడిది అద్దాల మేడ.. మన నెత్తురు తాగినాది ఆడింటి ఇటుకబెడ్డ ఛల్.. ఎహే ఎత్తర ఎత్తు పిడికిలి ఎత్తు..’ అంటూ సాగుతోందీ గీతం. విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటను భాస్కరభట్ల రాయగా, నల్గొండ గద్దర్ నర్సన్న పాడారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్; ఎడిటర్: చోటా కే ప్రసాద్.