నాపై అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చెయ్
- పరీక్ష పాసయ్యే డీజీపీ ఐనవా?
- అధికారం కోసం ఉద్యమకారులను దగా చేసిన రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన హామీ ఇవ్వాలి
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి) : తనపై అసభ్యకరంగా కామెంట్లు చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటం పట్ల తెలంగాణ రక్షణ సేన అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntlas kavitha)ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుం డా, కేసు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అసలు పరీక్ష పాసయ్యే ఆయన డీజీ పీ అయ్యారా? చట్టమైనా తెలుసా అని నిలదీశారు. వెంటనే కానిస్టేబుల్ పై చర్యలు చేప ట్టకుంటే అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు.
బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను వాడుకొని మోసం చేశాడని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వారికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలను అస భ్యంగా ఒక్క పదం మాట్లాడినా 3 ఏళ్ల శిక్ష వేసేలా చట్టాలు ఉన్నాయని, అవి డీజీపీకి తెలియదా? అంటూ నిలదీశారు. 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉండి, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.






