అండర్19కు ఆశ్రిత గౌడ్ ఎంపిక అభినందనీయం
లార్డ్స్ విద్యాసంస్థల చైర్మన్ సిద్దాల బీరప్ప
బడంగ్ పేట్ సెప్టెంబర్ 26:(విజయక్రాంతి) లారడ్స్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అక్కి ఆశ్రిత గౌడ్ అండర్-19 హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం అభినదనీయమని లారడ్స్ విద్యాసంస్థల చైర్మన్ సిద్దాల బీరప్ప (Siddala Beerappa, Chairman of Lords Educational Institutions)పేర్కొన్నారు. మీర్ పేట్ కు చెందిన అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ దంపతుల కుమార్తె ఆశ్రిత బీసీసీఐ ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 2026 నుండి కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న అండర్-19 టీ20 టోర్నమెంట్ కు హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించను న్నందున లారడ్స్ పాఠశాల యాజమాన్యం ఆశ్రితను ఘనంగా సన్మానించింది, అభినందించారు.
ఈ సందర్భంగా లారడ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్ధాల బీరప్ప మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారని ప్రశంసించారు. ఆశ్రితకు నిరంతరం శిక్షణని స్తూ ప్రోత్సహించిన ఆమె తండ్రి, కోచ్ అయి న అక్కి ఈశ్వర్ గౌడ్ను ఆయన అభినందించారు.
పాఠశాల వైస్ చైర్మన్ బెర్లూ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత మాట్లాడుతూ... నేటి విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆశ్రిత విజయం అందరికీ ఆదర్శం గా నిలుస్తుందన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీన్ బి.సతీష్ గౌడ్, ప్రిన్సిపల్ ఎం.ఎల్. మరియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొ ని ఆశ్రితకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.