నిరుద్యోగులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది

03-10-2026 | 04:25pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పోలీస్ రిక్రూట్‌మెంట్‌(Police Recruitment)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రతి అడుగులో జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) అన్నారు. శుక్రవారం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు  స్టడీ మెటీరియల్(Police Distributes Study Material) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఉచిత వసతి, భోజనం, విద్యా, శారీరక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రవేశ పరీక్షకు సుమారు 2,700 మంది హాజరుకాగా, ప్రతిభ ఆధారంగా 150 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. రాత పరీక్షకు అవసరమైన అంకగణితం, రీజనింగ్ తదితర అంశాల్లో స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు ఇప్పటివరకు మూడు పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా సమర్థవంతంగా సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రతి వారం అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి, అవసరమైన వారికి అదనపు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణలో అభ్యర్థులు క్రమశిక్షణతో, ఆసక్తిగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సతీష్, టౌన్ ఇన్‌స్పెక్టర్ నీలం రవి, పోలీస్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు