అసెంబ్లీ 16కు వాయిదా
- రేపు మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) ఈ నెల 16కు వాయిదా పడ్డాయి. రెండు రోజుల విరామం తర్వాత మంగళవారం ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. శనివారం ప్రశ్నావలితో పాటు స్వల్పకాలిక చర్చలో భాగంగా 22 ఏ (నిషేధిత భూములు(Prohibited lands) ) అంశంపైన సభలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఎల్‌నినో(El Nino) ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చ జరగాల్సి ఉండేది.
నిషేధిత భూముల అంశంపైన సభలో మంత్రులు, అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు మాట్లాడారు. అయితే 22 ఏపైన అధికార పక్షం, బీజేపీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఎల్‌నినో పరిస్థితిపై చర్చకు రాలేదు. మంగళవారం ఎల్‌నినోపై చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.