అదరగొట్టిన అథ్లెట్లు
4x400 మీ. రిలేలో రజతం
10 వేల మీటర్ల రేసులో కాంస్యం
నగోయా, సెప్టెంబర్ 24: ఆసియా క్రీడల్లో(Asian Games) భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. మికస్డ్ 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత జట్టు రజత పతకం సాధించింది. మచేత్తిర పూవమ్మ, విశాల్ తె న్నరసు, విత్యా రామ్‌రా జ్, మను టి.ఎస్‌తో కూ డిన భారత బృందం 3:14.46 సెకన్లలో రే సును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.
బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, వియత్నాం జట్టును స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి భారత్ రజతాన్ని ఖాయం చేసుకుంది. చివరి లెగ్‌లో విత్యా రామ్‌రాజ్ పరుగు భారత జ ట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పా త్ర పోషించింది. మహిళల 10 వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ సీమా కు మారి కాంస్యం గెలుచుకుంది.
ఈ విజయంతో ఆసియా క్రీడల్లో ఈ విభాగం లో గత 16 ఏళ్లుగా భారత్‌కు ఎదురుచూస్తున్న పతకాల కరవును సీమా కు మారి ముగించింది. ఆసియా క్రీడల చరిత్ర లో మహిళల 10వేల మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మూడో పతకం ఇది. 2 010లో భారత అథ్లెట్లు స్వర్ణం, రజతం గెలిచారు. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ప్రెడ్ య వీ స్వర్ణం, జపాన్‌కు చెందిన నొజోమీ తనకా రజతాన్ని గెల్చుకున్నారు. సీమ స్వర్ణ పతక వి జేత కంటే 10. 87 సెకన్లే వెనకబడింది. సీ మాకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీ డియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.