బైక్‌ను తప్పించబోయి లారీని ఢీకొన్న ఆటో

29-09-2026 | 05:05am
  1. నలుగురి దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం
  2. మృతులంతా షాపింగ్ మాల్‌లో పనిచేసే మహిళలు
  3. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద ఘటన

మంచిర్యాల క్రైమ్, సెప్టెంబర్ 28: మంచిర్యాల జిల్లా(Mancherial District) నస్పూర్ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Horrific road accident) నలుగురు మృతిచెందిన ఘటన సోమవా రం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాలకు(Ponnaram village) చెందిన మహిళలు(Women) మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్‌లో(Shopping mall) పని చేస్తున్నారు. సోమవారం విధుల్లో పాల్గొనేందుకు ఆటోలో ఏడుగురు మహిళలు మంచిర్యాలకు బయలుదేరారు. నస్పూర్ గేటు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని(Two-wheeler) తప్పించబోయి మంచిర్యాల నుంచి జైపూర్ వైపు వెళ్తున్న లారీనీ ఆటో వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చింతకుంట్ల లక్ష్మి (30), సౌందర్య (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. తాటిపల్లి సోనియా (25), సుమలత (21), దివ్య వాణి, నారమల్ల లక్ష్మీ, అనూషలకు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ తాటిపల్లి సోనియా (25), సుమలత (21) మృతి చెందారు. అనూష పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలిం చారు. వాణి, నారమల్ల లక్ష్మీ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

నస్పూర్ ఎస్సై తైసినోద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఆటో డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రు లోని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కరికి రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున తక్షణ ఆర్థిక సాయాన్ని కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు జగన్ మోహన్ రావు మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అందజేశారు.

మరిన్ని వార్తలు