రోడ్డెక్కిన సంత.. వాహనదారులకు అవస్థలు..

29-09-2026 | 05:25am

రోడ్డుపైనే వ్యాపారం!

మార్కెట్ స్థలం మింగేస్తున్న ఆక్రమణలు?

పట్టించుకోని అధికారులు

కౌటాల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మండల కేంద్రంలో వారపు సంత నిర్వహణకు ప్రత్యేక మార్కెట్ స్థలం(Marketplace) ఉన్నా.మార్కెట్ స్థలం క్రమంగా ఆక్రమణలకు గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ప్రతి సంత రోజు ప్రధాన రహదారిపైనే(Main road on market day) వ్యాపారాలు సాగుతున్నాయి. రోడ్డుకు(Road) ఇరువైపులా కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువుల దుకాణాలు(Shops) ఏర్పాటు చేయడంతో రహదారి కుంచించుకుపోతోంది. కొనుగోలుదారులు రోడ్డుపైనే తిరుగుతుండగా.. వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. సంత రోజు కౌటాల ప్రధాన రహదారి దాటాలంటే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

స్థలం ఉన్నా ఉపయోగం శూన్యం..

మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడే వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటే రహదారిపై రద్దీ తగ్గే అవకాశం ఉంది. కానీ ఏళ్లుగా మార్కెట్ స్థలం పరిస్థితిపై సరైన దృష్టి లేకపోవడంతోనే సమస్య కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు.

ఆక్రమణలపై చర్యలేవీ?

మార్కెట్ స్థలానికి సంబంధించిన హద్దులను అధికారులు గుర్తించారా? ఎంత భూమి కేటాయించారు? ప్రస్తుతం ఎంత భూమి అందుబాటులో ఉంది? ఎవరైనా ఆక్రమించారా? అనే విషయాలను అధికారులు బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణలు ఉంటే తొలగించి మార్కెట్ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డే మార్కెట్.. రద్దీతో అవస్థలు

సంత రోజున రహదారిపై ఏర్పడే రద్దీతో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వంటి వాహనాలు వెళ్లాల్సి వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మార్కెట్కు స్థలం ఉన్నా సంత రోడ్డుపైనే ఎందుకు? స్థలం ఆక్రమణకు గురైతే చర్యలు ఎప్పుడు?  రహదారిపై సంతకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు