ఫోరమ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఏర్పాటు

29-09-2026 | 05:05am

కన్వీనర్‌గా సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి

ముషీరాబాద్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): రాజ్యాంగ విలువలు(Constitutional Values), ప్రజాస్వామ్య వ్యవస్థలు(Democratic systems), రాజకీయ విలువల పరిరక్షణే ధ్యేయంగా విద్యావేత్తలు(Educationists), రిటైర్డ్ అధికారులు(retired officials), న్యాయకోవిదులు, జర్నలిస్టులతో(Journalists) కూడిన ‘ఫోరమ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ’(Forum for Constitutional Democracy) వేదిక హైదరాబాద్‌లో సోమ వారం అధికారికంగా ప్రారంబించారు. బషీర్‌బా గ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫోరమ్ కన్వీనర్‌గా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తిని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడు తూ భిన్న రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికా రులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోనే సాధ్యమైందన్నారు. దేశంలో రాజ్యాంగ సంస్థల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, రాజ్యాంగబద్ధ పాలన కోసం పౌర సమాజం గొంతు విప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి. హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ ఎంవీ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ జ్యోతి కిరణ్, సామాజికవేత్త డాక్టర్ గాదె గోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ విరహత్ అలీ, బత్తిని దీప్తి మాట్లాడుతూ భయం, పక్షపాతం, లేకుండా సామాజిక, రాజకీయ అంశాల పై స్వేచ్చగా చర్చించి, ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రశ్నించడం, అప్రమత్తం చేయడమే లక్ష్యంగా వేదిక పనిచేస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు