ముంచెత్తిన వానలు.. 24మంది మృతి

28-09-2026 | 05:09pm

నేపాల్‌(Nepal)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మృతి చెందారు. బాగ్లుంగ్‌ జిల్లాలోని గల్కోట్‌(Galkot)లో ప్రభుత్వ భవనం వరద నీటికి కొట్టుకుపోయింది. ప్రకృతి వైపరీత్యంతో 747 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. మనాంగ్‌, మ్యాగ్డి, పర్బత్‌, పాల్పా ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదలకు 143 ఇళ్లు ధ్వంసమయ్యాయి.


మరిన్ని వార్తలు