ఎన్నికల్లో విజయం మనదే
- బీజేపీ, కాంగ్రెస్‌పై యువతరం రగిలిపోతోంది
- సిట్టింగ్ స్థానంలో బీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం
- ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
- మూడు జిల్లాల నేతలతో సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Hyderabad-Rangareddy-Mahabubnagar Graduate MLC Election) బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో సోమవారం హైదరాబాద్, ఉమ్మడి రం గారెడ్డి, మహబూబ్‌గర్ నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని నిలబెట్టి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకు న్నామని గుర్తుచేశారు.
పార్టీ నేతలంతా ప్ర ణాళికాబద్ధంగా సమిష్టిగా పనిచేయడం వల్లే ఆరోజు గెలుపు సాధ్యమైందని తెలిపారు. ఈ సారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సిట్టింగ్ స్థా నాన్ని గెలుచుకునేందుకు బీఆర్‌ఎస్‌కే అన్నిరకాల అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియ(Voter registration process) కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ నేతలంతా ఈ ఆయా జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్‌లు తమ ఓట్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ వేగంగా తగ్గుతోందని, యువత ఆ పా ర్టీకి దూరమైందనే ఆందోళన ఆ పార్టీ అగ్రనేతలను కూడా వెంటాడుతోందని స్పష్టం చేశారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తారస్థాయి కి చేరిందని తెలిపారు. రెండు ఢిల్లీ పార్టీలపై ప్రజాక్షేత్రంలో యువతరం రగిలిపోతోందని, ఈ తరుణంలో బీఆర్‌ఎస్ రెండుకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు.
పట్టభద్రులందరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారంహైదరాబాద్‌లో తన ఓటును నమోదు చేసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడూ ఓటర్ నమోదును పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 30న సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీని మూడేళ్లు కావస్తున్నా ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలతో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ--డీ నుంచి బీసీ--ఏకు మార్చే హామీపై సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.