కాంగ్రెస్ ధర్నా

28-09-2026 | 02:06pm
  1. కలెక్టర్ కార్యాలయం ముందు
  2. భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీనామా చేయాలి. 
  3. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహించాలి: 
  4. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ.

నాగర్‌ కర్నూల్, (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో( SIR Irregularities) జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా(Congress Dharna) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే(Achampet MLA), జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు