వీబీజీ రాంజీ పథకంపై అవగాహన

16-09-2026 | 08:21pm

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ బెండారే కృష్ణాజి అధ్యక్షతన వీబీజీ రాంజీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా గ్రామానికి, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు, లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

సర్పంచ్ బెండారే కృష్ణాజి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఇతర అభివృద్ధి పనులను పథకం ద్వారా చేపట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఏ ప్రభాకర్, ఉప సర్పంచ్ జాడే సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్య, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు