బాలికల మరుగుదొడ్ల నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేయండి: పి.ఆర్.డి.ఈ
16-09-2026 | 10:41pm
బోథ్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డి ఈ రాజేశ్వర్(Panchayat Raj DE Rajeshwar) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలో స్థల వివాదం నెలకొనడంతో స్థానిక ఎంపీడీవో రమేష్ మండల విద్యాధికారి మహ్మద్ హుస్సేన్ లతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సకాలంలో వీటిని పూర్తి చేయాలని. సూచించారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్. సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతానంద రెడ్డి తదితరులు ఉన్నారు