మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్య
నిర్మల్ సెప్టెంబర్ 13( విజయ క్రాంతి): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కు మూఢనమ్మకాలు ప్రజా చైతన్యం చేస్తున్నామని జన విజ్ఞాన వేదిక(Peoples Science Forum) రాష్ట్ర ఉపాధ్యక్షులు వరప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా మహాసభలు స్థానిక టి. ఎన్.జి.ఓ భవన్ లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల వరప్రసాద్ హాజరు అయి మాట్లాడుతూ విద్య అనేది ప్రజల హక్కు అని, నాణ్యమయిన విద్యను అందించవలిసిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలియజేశారు. దేశంలో 40 వేలకు పైగా పాఠశాలలు మూతపడి, పేదవారికి విద్య దూరం అయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని పరికర, సౌకర్యాలు కల్పించి, పేదలకు వచ్చే అన్ని వ్యాధులకు మెరుగైన వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు.డిప్యూటి ఎఫ్. ఆర్. ఓ. మహ్మద్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి వ్యక్తి పాలుపంచుకోవాలని, పర్యావరణం ఈ విధంగానే ధ్వంసం అయితే భూగోళం ఏ జీవరాశి మనుగడ సాగించదని, అడవులు ఋతు పవనాలు సజావుగా సాగేందుకు సహాకరిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఆకుల సుదర్శన్, కొండా రాములు, అనంత్ విశ్వేశ్వర్ , అంకం గంగాధర్, జిల్లా అధ్యక్షుడిగా షేక్ రఫీక్, ప్రధాన కార్యదర్శిగా బిక్షపతి నాయక్, కోశాధికారిగా వఠ్ఠోలి ముత్తన్న, ఉపాధ్యాక్షులు గా ఏనుగు రాజారెడ్డి, రావుల గంగన్న, మధుకర్, వందన కుమారి, కార్యదర్శులుగా నవీన్ కుమార్, జి. భోజన్న, వీరేశ్, చెకుముకి కన్వీనర్ గా. జి. నారాయణ వర్మ .సామాజిక న్యాయం కమిటీ కన్వీనర్-గజపల్లి నర్సయ్య .శాస్త్రప్రచార కమిటీ SK.నబీ, సోషల్ మీడియా కమిటీ దేవెందర్,పర్యావరణ కమిటీ బచ్చుశ్రీనివాస్ ,సాంస్కృతిక కమిటీ అంబటి నారాయణ ఆరోగ్య కమిటీ సల్లా శ్రీనివాస్.