సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

07-09-2026 | 11:18pm

కోనరావుపేట,(విజయక్రాంతి): సైబర్ నేరాలు(cybercrime), ట్రాఫిక్ నిబంధనలపై(traffic rules) ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఎస్సై బి రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించవద్దని సూచించారు.ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై బి రామ్మోహన్ కోరారు.

మరిన్ని వార్తలు