గణపతి నవరాత్రి మహోత్సవాలు

25-09-2026 | 01:41pm

11 రోజుల పాటు నిష్టా నియమాలతో ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదం, లక్ష్మీదేవి కుంకుమ పూజ.. మహిళలకు చీరల పంపిణీ

లడ్డూ వేలంలో మండల రికార్డు.. రూ.66,116లకు బానోత్ బాలు–మంగా దంపతుల కైవసం

భక్తిగీతాలు, కోలాటాలతో గణపయ్య స్వామి పల్లకీ సేవ.. ఘనంగా నిమర్జనం..

సింగరేణి,(విజయక్రాంతి): సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య తండా గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన(Sri Prasannanjaneya Swamy Temple) ప్రాంగణంలో కొలువుదీరిన బాల గణపయ్య స్వామి నవరాత్రి మహోత్సవాలను ఆలయ చైర్మన్ ధరావత్ కళ్యాణ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.11 రోజుల పాటు బాల గణపతి స్వామికి భక్తులు నిష్టా నియమాలతో మాలధారణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం, లక్ష్మీదేవి కుంకుమ పూజ నిర్వహించి గణేష్ ఉత్సవ కమిటీ తరుపున ఈమహిళలకు సర్పంచ్ బానోత్ హీరాలాల్, ఆలయ చైర్మన్ ధరావత్ కళ్యాణ్,కమిటీ సభ్యులు చీరలు పంపిణీ చేశారు.

లడ్డూ వేలం కార్యక్రమంలో మండల స్థాయిలో రికార్డు స్థాయిలో రూ.66,116లకు బానోత్ బాలు–మంగా దంపతులు లడ్డూను కైవసం చేసుకున్నారు.కలశం వస్త్రాలను వాంకడోత్ సురేష్ వీరమ్మ దంపతులు 17516,స్వామి వారి ముల్లు కర్ర ను 9116 కు బానోత్ దేవు పద్మ దంపతులు ,స్వామి వారి పట్టాలను 5716 రూపాయలతో గుగులోత్ రమేష్ విజయ దంపతులు దక్కించుకున్నారు.చివరి రోజు కోలాటాలు, భక్తి గీతాల మధ్య గణపయ్య స్వామివారిని పల్లకిలో ఊరేగించి, భక్తిశ్రద్ధలతో నిమర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నూనావత్ నాగేష్ ,మహేష్, జయంత్, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు