భక్తి పారవశ్యంలో బాన్సువాడ
వైభవంగా భారడీ పోచమ్మ బోనాలు
బాన్సువాడ, సెప్టెంబర్ ౬ : పట్టణ శివారులోని భారడీ పోచమ్మ అమ్మవారికి బో నాల పండుగ (Bonala Festival) ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు బోనమెత్తుకొని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. సం ప్రదాయ దుస్తుల్లో మహిళలు బోనాలతో త రలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించి బోనాలు సమర్పించారు. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
బోనాల సందర్భంగా మహిళల కోలాటాలు, భక్తి గీతాలు, నృత్యాలతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో బోనాల నిర్వాహక అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత పోలీసులు,అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.భారడీ పోచమ్మ బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో సాగడంతో బాన్సువాడలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.






