పుష్కరాల నాటికి బాసరకు వైభవం
354 కోట్లతో అభివృద్ధి పనులు
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్మల్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిల యమైన బాసర లో గోదావరి పుష్కరణ నా టికి పనులను పూర్తి చేసి ఆధ్యాత్మిక కేం ద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జి ,రాష్ట్ర మ ద్యం, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జూపల్లి కృష్ణారావు(District In-charge Minister Jupally Krishna Rao) తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కృషి తో ఇప్పటికి 354 కోట్లతో బాసర పునరవభివృద్ధి పనులు జరుగుతున్నట్టు తెలిపారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పా రు. ఆదివారంరూ రూ.20 కోట్లతో చేపట్టను న్న పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.354 కోట్లతో చేపట్టనున్న ఆలయ స మగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ లయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు.గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిం చేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆ దేశించారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలివ చ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కర ఘాట్లను అవసరమైన మేరకు విస్తరించడంతో పాటు, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పుష్కరాల కోసం దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృ ద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్న ట్లు వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లను ని రంతరం పర్యవేక్షించేందుకు ప్రజాభవన్లో ప్ర త్యేక సెల్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు.
అ న్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి జాప్యం లేకుండా పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.బాసరతో పాటు గోదావరి నదీ తీ ర జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శా ఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఆ ధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర గోదావరి పుష్కరాల ఏ ర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాద నలు, పనుల పురోగతిని మంత్రి జూపల్లి కృ ష్ణారావుకు వివరించారు. నిర్దేశిత గడువులో గా అన్ని పనులను పూర్తి చేసి, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని కలె క్టర్ తెలిపారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎ మ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిర ణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






