7 September, 2026 | 8:19 AM

దుబాయ్‌లో బతుకమ్మ.. కేటీఆర్‌కు ఆహ్వానం

07-09-2026 | 05:10am

అక్టోబర్ 11న జీటీఎఫ్, ఈటీసీఏ ఆధ్వర్యంలో వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ దేశ విదేశాలకు విస్తరించుకున్నది తెలిసిందే. దు బాయ్‌లో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతాయి. గల్ఫ్ తెలంగాణ ఫోరం (జీటీఎఫ్)(Gulf Telangana Forum) , ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (Emirates Telangana Cultural Association)(ఈటీసీఏ) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించను న్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.

జీటీఎఫ్ ఫౌం డర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వం లో ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించ డంతో పాటు, అక్కడి తెలంగాణ సమాజం లో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అ నుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు జీటీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

అక్టోబర్ 11న (జీటీఎఫ్) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఒక వేడుక, అలాగే ఈటీసీఏ ఆధ్వర్యంలో రా త్రి 8 నుంచి 10 గంటల వరకు మరో బతు కమ్మ వేడుక జరగనుంది. రెండు కార్యక్ర మాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని మహేష్ బిగాల తెలిపారు. ఈ వేడుకలకు సంబంధిం చిన ప్రచార కరపత్రాన్ని కూడా ఆవిష్కరిం చారు. బతుకమ్మను కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగా ణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని, గల్ఫ్ దేశాల్లోనూ ఈ పండుగకు విశేష ఆద రణ లభిస్తోందని ఆయన తెలిపారు.

ప్రవాస తెలంగాణ సమాజం తమ స్వస్థలాలతో ఉ న్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగిం చేందుకు బతుకమ్మ వేడుకలు ఒక వేదికగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నా రు. తెలంగాణ మహిళలు సంప్రదాయ దు స్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, పాట లు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వ హించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సం స్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా కార్యక్ర మాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

కేటీఆర్ దుబాయ్ బతుకమ్మ వేడుకలకు హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి పండుగ లో పాల్గొంటే తమకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలి పారు.   కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృంద ంలో జీటీఎఫ్ ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్, జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు