పట్టణ TPCC SC సెల్ అధ్యక్షులుగా కుంభాల రాజేష్
01-10-2026 | 02:56pm
బెల్లంపల్లి: పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కుంభాల రాజేష్ (Kumbhala Rajesh)నియమితులయ్యారు. ఈమేరకు ఆయన నియామక ఉత్తర్వులు జారీఅయ్యాయి. తన నియామకం పట్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్,టీపీసీసీ మెంబర్ చిలుముల శంకర్, ఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు మల్లారపు చినరాజం కు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుకొని అన్ని వర్గాల గొంతుకగా నిలుస్తానని తెలిపారు. వారి హక్కులు సంక్షేమం సామాజిక న్యాయం కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.