ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

16-09-2026 | 08:40pm

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Municipal Chairman Birudu Radhakrishna) అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు సూచనతో ఏడవ వార్డులో ఉన్న పల్లె దవాఖానను వార్డు కౌన్సిలర్ వర ప్రదీప్ తో కలిసి పరిశీలించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి చక్కటి వైద్య సేవలు అందించాలని డాక్టర్ సింధుజతో అన్నారు. సిబ్బందితో, దావకానకు చికిత్స కోసం వచ్చిన ప్రజలతో వైద్య చికిత్సలు సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు.  ఈర్ల స్వరూప శేఖర్. గాదాసు మంజుల రవీందర్ వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు