పేదల భూములు దోచుకోవడానికే

10-09-2026 | 07:50pm

- 22ఏ నిషేధిత భూముల జాబితా

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): పేదల భూములు దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(22A) నిషేధిత భూముల జాబితా తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి(BJP State Vice President Raghunath Verabelli) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా ఉన్న నివాస, వ్యవసాయ భూములు జాబితా(Agricultural lands list) తొలగించాలని వినతి, అదే విధంగా 22 A నిషేధిత జాబితాలో ఉన్న బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను గురు వారం బీజేపీ నాయకులు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కు అందజేశారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ... పేద ప్రజల భూములు దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం 22A జాబితా తీసుకవచ్చిందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో లేదా మధ్య తరగతి ప్రజల భూములు లేకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత భూముల భూముల జాబితాలో చేర్చిందని అన్నారు. మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) 22Aలో ఒక్కరి పేరు ఉన్న రాజీనామా చేస్తామని చెప్పిన మాట ప్రకారం మంచిర్యాల నియోజకవర్గంలో 22Aలో ఉన్న జాబితాను తొలగించాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22A జాబితాలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. 22A భూ బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు