గణేష్ ఉత్సవాల్లో ప్రజలకు సూచనలు
చవితిని సురక్షితంగా, పర్యావరణహితంగా, ప్రశాంతంగా మరియు ఆనందంగా జరుపుకుందాం
ఈ వినాయక చవితిని సురక్షితంగా, పర్యావరణహితంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకుందాం
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల, మండల పరిధిలోని వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం కోసం నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కల్హేర్ ఎస్సై రవి గౌడ్(Kalher SI Ravi Goud) తెలిపారు. ఇందుకోసం అధికారిక ఆన్‌లైన్ ఇన్టిమేషన్ ఫారం ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చని - సులభం, వేగవంతం తప్పనిసరన్నారు. పోలీస్ వారి ముఖ్యమైన జాగ్రత్తలు:-గణేష్ మండపాలు, విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందుగా పోలీసుల అనుమతి తప్పని సరి పొందాలి. చెరువులు, కుంటలు దగ్గర నిమర్జన సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి. మండపాలు, ఊరేగింపుల సమయంలో అధిక రద్దీకి తావివ్వకుండా నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాలను మాత్రమే వినియోగించాలి.
అధిక శబ్దంతో డీజేలు, హై-డెసిబెల్ సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదు. డీజేలు పూర్తిగా నిషేధం. మండపాల వద్ద భద్రత కోసం సరైన బారికేడింగ్, లైటింగ్ మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేయ్యాలి. గణేష్ ఊరేగింపుల సమయంలో అత్యవసర సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు (లేదా) కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. అందరం కలిసి ఈ వినాయక చవితిని సురక్షితంగా, పర్యావరణహితంగా, ప్రశాంతంగా మరియు ఆనందంగా జరుపుకుందాం...ఈరోజే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోండి. సురక్షితంగా ఉండండి – బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోండి అని కల్హేర్ ఎస్సై రవి గౌడ్ తెలిపారు.