ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

27-09-2026 | 05:25pm

నివిన్ పౌలీ(Nivin Pauly), మమితా బైజు(Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో నటించిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదలైనప్పటికీ ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన సమీక్షలను అందుకుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.325 కోట్లు వసూలు చేసి 'లోక చాప్టర్ 1 చంద్ర', 'తుడరుమ్', 'ఎల్2 ఎంపురాన్' పేరిట ఉన్న రూ.302 కోట్ల రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. తాజాగా, ఈ మూవీ అక్టోబర్ 2న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జియోహాట్‌స్టార్‌(jioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. 

మరిన్ని వార్తలు