15 April, 2026 | 6:38 AM

మంథని 9వ వార్డులో బొబ్బిలి కవితశ్రీధర్ నామినేషన్

29-01-2026 04:35 PM

మంథని 9వ వార్డులో బొబ్బిలి కవితశ్రీధర్ నామినేషన్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు  సభ్యులుగా బొబ్బిలి కవిత శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు సహకారంతో తొమ్మిదో వార్డులో బరిలో నిలిచామని, వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే మంత్రి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.