విజయక్రాంతి ఎఫెక్ట్.. రోడ్డు మరమ్మతులు ప్రారంభం
దమ్మపేట, నవంబర్ 25 (విజయక్రాంతి): మురసు తుఫాను (Murasu Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) దమ్మపేట పేరంటాళ్ల చెరువు అలుగు కాలువకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు చెరువుకు సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న తారు రోడ్డుపై నుంచి ప్రవహించింది. గుడిమెట్ల బాలరాజు పామాయిల్ తోట సమీపంలో రోడ్డు కింద మూడు అడుగుల లోతు వరకు మట్టి కొట్టుకుపోయింది.
దీంతో ఆ మార్గంలో ప్రమాదం పొంచి ఉందని ఈ నెల 7న ‘ప్రమాదభరితంగా దమ్మపేట-నల్లకుంట రోడ్డు.. పొంచి ఉన్న ప్రమాదం’ శీర్షికన విజయక్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన ఆర్‌అండ్‌బీ (R&B Department) అధికారులు మరమ్మతులు చేపట్టారు. దమ్మపేట నుంచి మల్కారం మీదుగా మద్దికొండ వరకు ఆర్‌అండ్‌బీ వరద అత్యవసర నిధుల (Flood Relief Funds) నుంచి పనులు చేపట్టారు.