మిల్లులో పేలిన బాయిలర్.. తప్పిన ప్రమాదం
11-09-2026 | 06:41pm
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్(Hajipur) మండలంలోని సబ్బపల్లి గ్రామ శివారులో గల ఓ పారాబాయిల్డ్ రైస్ మిల్ లో బాయిలర్ పేలిన సంఘటన శుక్ర వారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంతోష్ అనే కార్మికుడికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అతన్ని వైద్యం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాయిలర్ లో ధాన్యం పంపించి బాయిల్డ్ చేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. బాయిలర్ ట్యాంకు రేకు ముక్కలు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో మిల్లు యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు, నాయకులు, మిల్లర్ అసోసియేషన్ నాయకులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.