7 September, 2026 | 6:08 AM

బొమ్మల పల్లకి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం

07-09-2026 | 04:55am

కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహణ

నందికంది, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ‘బొమ్మల పల్లకి(Bommala Pallaki)’ ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ సభ నందికందిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చరిత్రను దృశ్య రూపంలో, శాస్త్రీయ పద్ధతిలో భావితరాలకు భద్రపరచాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ వీడియో రూపకల్పన పోటీలకు అద్భుతమైన స్పందన లభించింది.

ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులు, పురస్కారాలు అందజేశారు. ‘సీతమ్మ లొద్ది యాత్ర’పై డి రవీందర్‌రెడ్డి రూపొందించిన వీడియోకు ప్రథమ, శ్రీరంగపర్ రంగనాయకుల చరిత్ర’పై ఎన్.విష్ణు రూపొందిన వీడియోకి ద్వితీయ పురస్కారాలు లభించాయి. అలాగే తెలంగాణ చరి త్రపై విభిన్న అంశాలతో వీడియోలు రూపొందించిన యూనుస్ పర్హాన్, యం. రవికుమార్, సముద్రాల రాజు, ఆచార్య భద్రగిరిష్, రంగాచార్యులు, సతీష్, రోహిత్, శ్రీనివాస్, సాయికుమార్, కిషోర్, నరేందర్, కరుణాకర్, రాజ్ కుమార్, రమేష్ శర్మ, శ్రీకాంత్ తదితరులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలు అందజేశారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్, ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన తరానికి వీడియోగ్రఫీ మా ధ్యమం ద్వారా చరిత్రను సులువుగా చేరవేయడానికి చరిత్ర బృందం చేస్తున్న ప్రత్యేక కృషిలో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కాగా భైరోజు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఇన్ట్యాక్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మణికొండ వేద కుమార్, కేటీసీబీ గౌరవ సలహాదారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి,  నందికంది సర్పంచ్ స్రవంతి విజయ భాస్క ర్ రెడ్డి, టార్చ్ ప్రధాన కార్యదర్శి అరవింద ఆర్యా , మఠం వినోద్ కుమార్, కపిలవాయి అశోక్ బాబు తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని వార్తలు