గుండె కోసం 8 అలవాట్లకు బ్రేకప్

23-09-2026 | 05:00am

కేర్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ చాణక్య కిషోర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రపంచ హృదయ దినోత్సవం(World Heart Day) సమీపిస్తున్న నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పును పెంచే రోజువారీ అలవాట్లపై అవగాహన అవసరమని కేర్ ఆస్పత్రి వైద్యులు(CARE Hospitals doctors) సూచించారు. కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ క్లినికల్(Hi-Tech City Clinical) డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. చాణక్య కిషోర్ కమ్మరిపల్లి(Chanakya Kishore Kammaripalli) మాట్లాడుతూ.. గుండె జబ్బుల 30 ఏళ్ల ముందే పెరుగుతుందని తెలిపారు.

ధూమపానం, అధిక ఉప్పు, అదనపు చక్కెర, గంటల తరబడి కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక మద్యపానం, హెల్త్ చెకప్స్‌ను వాయిదా వేయ డం వంటి 8 అలవాట్లకు దూరంగా ఉండా లని సూచించారు. రక్తపో టు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు