ప్రభుత్వ కార్యక్రమాలపై మండల సమైక్య సభ్యులకు వివరణ
నాగిరెడ్డి పేట్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో నాగిరెడ్డిపేట మండల(Nagireddypet Mandal) సమాఖ్య 19వ మహాజన సభ అధ్యక్షురాలు బెస్త శాంతమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరం యొక్క ప్రగతి నివేదికను చదివి వినిపించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం జరిగింది. అదే విధంగా మండల సమాఖ్య ఆదాయ,వ్యయాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మండల సమాఖ్య సాధించిన ప్రగతి అంశాల వారీగా సభ్యులకు వివరించడం జరిగింది.
అనంతరం ఈ సంవత్సరం పదవీ విరమణ పొందిన మండల సమాఖ్య కోశాధికారి మమత స్థానంలో ఎన్నికలు జరుపగా జప్తి జాన్కంపల్లి గ్రామ సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మిను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డైరెక్టర్ లుగా కిచ్చన్నపేట అధ్యక్షురాలు పడమటి లక్ష్మి,కన్నారెడ్డి అధ్యక్షురాలు సాయవ్వ ఎన్నికవ్వగా సమావేశానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి కొత్తగా ఎన్నికయినా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.