6 September, 2026 | 12:30 PM

ఓర్వలేక కాంగ్రెస్ పై విమర్శలు

06-09-2026 | 11:04am

మండల అధ్యక్షుడు గజ్జల రాజు 

ముస్తాబాద్,సెప్టెంబర్ 06( విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమ పథకాల కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చూపిస్తుందని, ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ల బాల్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ కనమెని చక్రాదర్ రెడ్డి ప్రసంగించారు.వేములవాడ రాజన్న ఆలయానికి మాజీ సీఎం కెసిఆర్(Former CM KCR) ఏటా వందకోట్లు ఇస్తానన్న మాట ఎక్కడ? దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్నది ఎవరు? మూడు ఎకరాల భూమి ఎక్కడ పాయే? దళిత బందు ఇస్తానని మోసం చేసింది ఎవరు?ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.

బతుకమ్మ పండగ పూట  ఆడపడుచులకు నాణ్యత లేని చీరలు అందించి, డబ్బులు దండుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు బాకీ కార్డులు అంటూ కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డారని ఏద్దేవా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అన్ని అమలవుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. నిరుపేదలకు విద్య,వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెస్తుందన్నారు.బిఆర్ఎస్ నాయకులు బాకీ కార్డుల పేరుతో చేస్తున్న సమ్మెలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

రైతులకు మహిళలకు యువతకు ప్రభుత్వం పెద్దపీట చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం పెరిగిందని వెల్లడించారు.ఎన్ని వేషాలు వేసిన బిఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ జిల్లా అధ్యక్షుడు కొండం రాజిరెడ్డి,యూత్ విభాగ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, నాయకులు ఆరుట్ల మహేష్,భాను, మల్లేష్,బాల్ రెడ్డి,శీల ప్రశాంత్, గోవర్ధన్ నాయక్,రాకేష్, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి,సాయి, ప్రశాంత్,నర్సయ్య తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు