134 జీవోను రద్దు చేయాలి

25-09-2026 | 01:46pm

తుంగతుర్తి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేదిత జాబితాలో చేర్చిన భూమి సమస్యల(Land issues) పరిష్కారం కోసం విడుదల చేసిన జీవో 134 ప్రత్యేకించి కెసిఆర్(KCR) కుటసభ్యులను, బిఆర్ఎస్ పార్టీ నాయకులను వేదించడానికి తెచ్చిన జీవో లాగ ఉన్నదని, దాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కిచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులు(Farmers) ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని. పలు ప్రజాసమస్యల పట్ల ప్రభుత్వం మీద పోరాడుతున్నారనే కక్ష సాధింపుకే ఈ జి ఒ. తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఆవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలాన్నింటిని గమనిస్తున్నప్రజలు, తగిన గుణ పాఠo చెప్పడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు