తెల్లారకముందే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై నేపథ్యంలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముట్టడి, నిరసనకు పిలుపు లేకున్నా అరెస్టులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని భయంతో తెల్లవారుజామున 4 గంటలకు తుంగ బాలుని అక్రమంగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక ప్రతిపక్షాల గొంతును, ప్రశ్నించే గొంతును, ముఖ్యంగా విద్యార్థి నాయకుల గొంతును అణచివేయడానికి అరెస్టులు చేయడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. నిన్న బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ పై నేతలు ఆందోళనలు జరగనున్న తరుణంలో అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: