బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడి ఆత్మహత్య

13-09-2026 | 05:25am
  1. పార్టీ కోసం అప్పులు అయ్యాయంటూ సూసైడ్ నోట్ 
  2. జగిత్యాల జిల్లాలో విషాదం

ధర్మపురి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ (BRS Party Mandal President Simhachalam Jagan)శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తిచెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ లేఖలో మృతుడు జగన్ పేర్కొన్నాడు. పార్టీ కార్యక్ర మాలకు చాలా ఖర్చయ్యిందని జగన్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.

అప్పటి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన ఆదేశాలను ఏనాడు కాదనలేదని, ప్రతీ కార్య క్రమానికి వేలల్లో ఖర్చయ్యేదని పేర్కొన్నాడు. అప్పుల వల్లే తను ఆత్మ హత్య చేసుకుంటు న్నాని లేఖలో తెలిపాడు. తన కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు ఆదుకో వాలని కోరుతూ వేడుకున్నాడు. తన భార్య పిల్లలకు బంధువులు, పార్టీ శ్రేణులు కూడా అండగా నిలవాలనీ జగన్ లేఖలో వేడుకున్నారు. 

మరిన్ని వార్తలు