విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్ ఆందోళన
విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి: మహ్మద్ అజమ్ అలీ
మలక్పేట్, సెప్టెంబర్ 5 (విజయ్ క్రాంతి): విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్ర మం నిర్వహించారు. మలక్పేట్ నియోజకవర్గంలో దిల్సుఖ్నగర్ లో విద్యార్థుల సమ స్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మహ్మద్ అజ మ్ అలీ (BRS party leader Mohammed Azam Ali) తన సహచరులతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహ్మ ద్ అజమ్ అలీ మాట్లాడుతూ.. ఎన్నికల స మయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు ఇతర విద్యా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, నేటికీ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వాటికి దూరంగా ఉన్నారని అన్నారు.
విద్యార్థులకు స్కూటీలు అందిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీపై ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెద్దఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఎప్పటికీ పోరాడుతుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరింత బలంగా తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఇన్చార్జి అజిత్ రెడ్డి, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ సయ్యద్ లాయక్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, పి. నర్సింగ్, మారుతి, ప్రభాకర్, ఆమిర్, తదితరులున్నారు.






