అగ్నికి ఆహుతైన బస్సు

25-09-2026 | 05:30am

9 మంది సజీవ దహనం

నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ అరెస్ట్

వాహనంపై 14 చలాన్లు

నెయిల్ పాలిష్, సిలిండర్ కారణమై ఉండొచ్చు

మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్న అధికారులు

లక్నో, సెప్టెంబర్ 24: నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. అందులో ప్రయాణిస్తున్న 9 మంది సజీ వ దహనమయ్యారు. బుధవారం అర్థరాత్రి నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే(Yamuna Expressway)పై ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకల్పనా ట్రావెల్స్‌కు చెందిన ఏ సీ స్లీపర్ కోచ్ బస్సు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని కశ్మీర్ గేట్ నుంచి మహోబాకు బయలుదేరింది.

నోయిడాలో ని జేవార్ విమానాశ్రయానికి 500 మీటర్ల దూరంలో ఉందనగా, అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢ నిద్దు లో ఉండగా మంటలు చెలరేగడంతో పలువురు తప్పించుకోలేకపోయారు. మంటలు చెలరేగగానే ఇద్దరు డ్రైవర్లు పవన్, వినోద్, కండక్టర్ యోగేష్‌లు బస్సు నుంచి దూకేశా రు. 8 మంది పురుషులు, ఒక మహిళ సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులుండగా 20 మంది కిటి కీ అద్దాలను పగులగొట్టి తప్పించుకోగలిగా రు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు మీడియాతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. డ్రైవర్, క్లీనర్‌లు బస్సులో సిగరెట్లు తాగడంతోనే మం టలు చెలరేగాయని ఆరోపించారు. తోటి ప్రయాణికులు వారించినా వారు వినలేదన్నారు. బస్సులో నుంచి కాలిన వస్తుందని చెప్పినా బస్సును డ్రైవర్ ఆపలేదని ఆరోపించారు. కొద్దిసేపటికే బస్సుకు మంటలంటు కున్నాయని చెప్పారు.

కాగా నోయిడా అగ్నిమాపకశాఖాధికారి ప్రదీప్ కుమార్(Noida Fire Department Officer Pradeep Kumar) మాట్లాడుతూ.. ఏసీలో పేలుడు కారణంగా ఇంజిన్‌కు మంటలు అంటుకున్నాయని ప్రాథమి క విచారణ ద్వారా తెలుస్తుందన్నారు. మం టలను ఆర్పాక బస్సు వెనుక భాగాన్ని కత్తిం చి సజీవ దహనం అయిన వారి మృతదేహాలను బయటికి తీసుకువచ్చామని చెప్పారు. బస్సు ఢిక్కీలో పెద్ద మొత్తంలో మండే స్వభా వం ఉన్న నెయిల్ పాలిష్, ఒక సిలిండర్ కూడా లభ్యమైందన్నారు. బస్సులో వీటి ర వాణా నిషేధం అని తెలిపారు.

మంటలు వేగంగా వ్యాపించేందుకు ఇవే కారణమై ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేశా రు. జేవార్డ్ ఎస్డీఎం దుర్గేష్ సింగ్ మాట్లాడుతూ.. ప్రమాదం అత్యంత విషాదకరమ న్నారు. ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు కష్టంగా మారిందన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపామని, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కుటుంబీకులకు అప్పజెబుతామన్నారు. ప్ర యాణికుల జాబితా ఆధారంగా మృతులను గుర్తించే ప్రక్రియను చేపట్టామని చెప్పారు.

మరిన్ని వార్తలు