కూచిరాజ్‌పల్లె ప్రజల సమస్యకు పరిష్కారం

08-09-2026 | 08:37pm

నూతన బస్టాండ్ నిర్మాణానికి కృషి

 మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తుల కృతజ్ఞతలు

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ(Manthani Municipality) పరిధిలోని 5వ వార్డు కూచిరాజ్‌పల్లెలో బస్టాండ్ లేకపోవడంతో కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు రోడ్లపైనే బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రజల ఇబ్బందులను గుర్తించి నూతన బస్టాండ్ నిర్మాణానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు, మున్సిపల్ వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల రోజువారీ ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నూతన బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బస్టాండ్ అందుబాటులోకి వస్తే కూచిరాజ్‌పల్లెతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యను గుర్తించి బస్టాండ్ నిర్మాణానికి చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబు, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు