తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి
పటాన్ చెరు: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి(Telangana Youth Protocol Chairman Aditya Reddy) తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్లోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ(Democratic system)లో రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దళిత స్పీకర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తాతా మధు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదిత్యరెడ్డి డిమాండ్ చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాకుండా, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఉన్నాయనిన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలనిన్నారు.